For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌… ఊహించినదాని కన్నా స్వల్పంగా పెరిగినా వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ప్రారంభమైంది. కొన్ని నిమిషాల్లోనే భారీ లాభాల్లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా నీరసంగా ఉన్న నాస్‌డాక్‌ సూచీ 1.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. సీపీఐ వృద్ధి రేటు 3.1 శాతం ఉంటుందని మార్కెట్‌ అంచనా వేయగా… 3.2 శాతంగా అధికారులు తేల్చారు. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండదేమోన్న ఆందోళన ఉన్నా… దిగువ స్థాయిలో సూచీలకు గట్టి మద్దతు లభించింది. నాస్‌డాక్‌తో పాటు డౌజోన్స్‌ కూడా 0.97 శాతం లాభంతో ఉంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.68 శాతం లాభంతో ట్రేడవుతోంది. సీపీఐ డేటా వచ్చిన వెంటనే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా పెరిగినా.. ఇపుడు స్థిరంగా ఉంది. అయితే క్రూడ్‌ ధరలు స్వల్పంగా పెరిగయి. ఇక బులియన్‌లో ఒత్తిడి కన్పిస్తోంది.