For Money

Business News

భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

ఇవాళ అమెరికా చట్ట సభల ముందు ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ రెండో రోజు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం నాస్‌డాక్‌ సూచీ 1.36 శాతం లాభంతో ట్రేడవుతోంది.మెటా, ఎన్‌విడా షేర్లు నాలుగు శాతం దాకా లాభంతో ఉన్నాయి. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఒక శాతం దాకా లాభంతో ఉంది. ఇక డౌజోన్స్ కూడా 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. వడ్డీ రేట్లు ఈ ఏడాది తగ్గుతాయని మార్కెట్‌ భావిస్తోంది. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ 103 దిగువకు పడిపోయింది. ఫలితంగా ఐటీ, టెక్‌ షేర్లు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. డాలర్‌ పతనంతో క్రూడ్‌, బులియన్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి.