For Money

Business News

డెరివేటివ్స్‌ దెబ్బ… లాభాలన్నీ పాయే

ఇవాళ నిఫ్టి తీవ్ర హెచ్చతగ్గులకు లోనైంది. ఏప్రిల్‌ నెల, వారపు డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌లకు ఇవాళ చివరి రోజు కావడంతో నిఫ్టిపై ఒత్తిడి తీవ్రంగా వచ్చింది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి పావు గంటలోనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 15044కి చేరింది. అరగంట తరవాత మొదలైన అమ్మకాలు 11 గంటల వరకు కొనసాగాయి. 11 గంటలకు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 14,814 పాయింట్లకు చేరింది. అంటే 230 పాయింట్లు క్షీణించిందన్నమాట. మిడ్‌ సెషన్‌ సమయానికి నిఫ్టి 14,950 దాకా వచ్చినా…లాభాలు నిలవలేదు. జర్మనీ డాక్స్‌ నష్టాల్లో ఉండటం, ఇతర సూచీలు గ్రీన్‌లో ఉండటంతో పాటు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టటి కేవలం 30 పాయింట్ల లాభంతో 14,894 వద్ద ముగిసింది. రెండు సెషన్స్‌ నుంచి భారీగా పెరిగిన బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ నష్టాల్లో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా రెడ్‌లో ముగిసింది. అయితే నష్టాలు మాత్రం నామమాత్రమే.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 726.20 9.59
టాటా స్టీల్‌ 1,035.00 6.55
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 11,175.45 6.54
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,475.00 3.68 హిందాల్కో 370.50 2.18

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హీరో మోటోకార్ప్‌ 2,857.00 -2.37
ఐషర్‌ మోటార్స్‌ 2,463.00 -2.31
బజాజ్‌ ఆటో 3,818.95 -1.82
ఎస్‌బీఐ 357.45 -1.64
హెచ్‌డీఎఫ్‌సీ 2,539.70 -1.45