For Money

Business News

15000పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి కన్నా మెరుగైన లాభంతో నిఫ్టి 150 పాయింట్ల లాభంతో 15,020 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. చాలా వరకు కార్పొరేట్‌ ఫలితాలకు మార్కెట్‌ స్పందిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు మెటల్స్‌, రిలయన్స్‌ నిఫ్టిని ముందుకు తీసుకెళుతున్నాయి. 12 ట్రేడింగ్‌ సెషన్స్‌ తరవాత నిఫ్టి 15000 స్థాయిని దాటింది. అప్ ట్రెండ్‌ కొనసాగే పక్షంలో నిఫ్టికి 15150 లేదా 15250 ప్రాంతంలో ప్రతిఘటన రావొచ్చు. ఏప్రిల్‌ నెలవారీ, వారపు డెరివేటివ్స్‌ ఇవాళ ముగింపు ఉండటంతో… నిఫ్టి ఎలా రియాక్టవుతోందో చూడాలి. నిన్న ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టిలో ట్రేడ్‌ చేయడంకంటే … ఎంపిక చేసిన షేర్లలో ట్రేడింగ్‌ చేయడం మంచిదని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 953.25 2.84
టాటా స్టీల్‌ 995.20 2.45
యాక్సిస్‌ బ్యాంక్‌ 725.05 2.39
హిందాల్కో 371.20 2.37
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 10,700.00 2.01

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా కన్జూమర్‌ 675.45 -0.25
విప్రో 488.45 -0.17
సిప్లా 909.20 -0.11
సన్‌ ఫార్మా 643.35 -0.01