For Money

Business News

లాభాలతో ప్రారంభంకానున్న నిఫ్టి

ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు జోష్‌ తెస్తున్నాయి. అలాగే కరోనా కేసుల జోరు ఆగుతుందన్న ఆశాభావంతో మార్కెట్‌ ఉంది. అయితే గత వారం రోజుల నుంచి వరుసగా అమ్మకాలు చేస్తూ వచ్చిన విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కొనుగోళ్ళు చేశారు. ఇన్వెస్టర్లను ట్రాప్‌లో పడేస్తున్నారా? లేదా ఈ అప్‌ట్రెండ్‌తో నిఫ్టి 15,000ని దాటుతుందా చూడాలి. కొనుగోలు చేసేవారు 14800 స్టాప్‌ లాస్‌ చేయాలని అనలిస్టలు సలహా ఇస్తున్నారు. అమెరికా మార్కెట్లు లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. యాపిల్‌, ఫేస్‌బుక్‌ కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినా… సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా సూచీలు కూడా డల్‌గా ఉన్నాయి. గ్రీన్‌లో ఉన్నా లాభాలు నామ మాత్రమే. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మరి నిఫ్టి కూడా ఇదే స్థాయి లాభాలతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి 14950 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురు కావొచ్చు. ఇవాళ ఏప్రిల్‌ నెల డెరివేటివ్స్‌కు క్లోజింగ్‌. కాబట్టి సూచీలో భారీ హెచ్చుతగ్గులు ఉంటామేమో చూడండి.