For Money

Business News

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్‌ మార్కెట్‌ ఇవాళ ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర ఇవాళ రూ.505 తగ్గి.. రూ.46,518 వద్దకు చేరింది. ‘అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, ఇదే సమయంలో డాలర్‌ స్థిరంగా ఉండటంతో దేశీయంగా బులియన్‌ ధరలు తగ్గాయని బులియన్‌ వర్తలు అంటున్నారు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.828 తగ్గి రూ.67,312లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,769 డాలర్లకు దిగొచ్చింది. వెండి మాత్రం ఔన్స్‌ ధర 26.02 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 90.88 వద్ద స్థిరంగా ఉంది.