For Money

Business News

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

రేపు ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ నేపథ్యంలో బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ షేర్లకు భారీ మద్దతు లభించింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన కౌంటర్లలో షార్ట్‌ కవరింగ్‌ కన్పించింది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం ప్రతి రోజూ అమ్ముతున్నారు. అధిక ధరల వద్ద విదేశీ ఇన్వెస్టర్లు బయటపడతున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ప్రతి రోజూ విదేశీ ఇన్వెస్టర్లు కనీసం రూ. 10000 కోట్లకు పైగా నికర అమ్మకాలు జరుపుతున్నారు. ఉదయం 14700 దిగువకు వెళ్ళిన నిఫ్టి … క్రమంగా మద్దతు పెరుగుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు కూడఆ మిశ్రమంగా ఉన్నాయి. ఆసియా, యూరో మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు భారీ లాభాలతో అంటే 211 పాయింట్ల లాభంతో 14,864 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ కూడా ఇదే స్థాయి లాభాలతో ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ ఏకంగా 3 శాతంపైగా పెరిగింది. దాదాపు మిగిలిన ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లోనే ముగిశాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,255.00 8.02
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 925.90 4.92
ఐషర్‌ మోటార్స్‌ 2,516.00 4.83
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 10,480.00 3.85
కొటక్‌ బ్యాంక్‌ 1,815.00 3.70

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,470.00 -2.01
హిందాల్కో 362.45 -1.04
నెస్లే ఇండియా 16,616.05 -0.97
దివీస్‌ ల్యాబ్‌ 3,874.00 -0.89 హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 673.00 -0.85