For Money

Business News

జొమాటొ రూ. 8,250 కోట్ల ఐపీఓ

ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటొ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఈ పబ్లిక్ ఆఫ్‌ ద్వారా రూ. 8,250 కోట్లు సమీకరించాలని జొమాటొ భావిస్తోంది. ఇందులో రూ. 7,500 కోట్లు కొత్త వాటా. ప్రస్తుతం కంపెనీలో వాటాదారుగా ఉన్న ఇన్ఫో ఎడ్జ్‌ మాత్రం రూ. 750 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. సెబీ ఓకే అన్న తరవాత పబ్లిక్‌ ఇష్యూ ధరను కంపెనీ ప్రకటించనుంది. 2008లో ఫుడీబే పేరుతో డీపిందర్‌ గోయల్‌, పంకజ్‌ చద్దా ఈ కంపెనీని ప్రారంభించారు.. తరవాత ఈ కంపెనీలో ఇన్ఫోఎడ్జ్‌ పెట్టుబడి పెట్టింది. 2010 జనవరి 18న ఈ కంపెనీ పేరును జొమాటొగా మార్చారు. కంపెనీ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ రావడంతో కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీలో టైగర్‌ గ్లోబల్‌, కోర, లక్సర్‌, ఫిడిలిటీ, డీ1 క్యాపిటల్‌, బైలీ గిఫార్డ్‌, మిరే, స్టెడ్‌ వ్యూ వంటి సంస్థలు పెట్టుబడి పెట్టాయి.2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 2,486 కోట్ల ఆదాయాన్ని పొందింది. కాని కంపెనీ నష్టం కూడా రూ. 2,451 కోట్లకు చేరింది. మరి షేర్‌ను ఏ ధరకు ఆఫర్‌ చేస్తారో చూడాలి.