For Money

Business News

14,700పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి కంటే మెరుగైన లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 82 పాయింట్ల లాభంతో 14,735 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఆటో షేర్లు కూడా ఇవాళ మార్కెట్‌కు అండగా నిలిచాయి. ముఖ్యంగా టీవీఎస్ మోటార్స్‌ పది శాతం లాభంతో ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 0.66 శాతం లాభంతో ట్రేడవుతోంది. కరోనా కేసులను మార్కెట్‌ దాదాపు పట్టించుకోవడం మానేసింది. దీంతో ఎంపిక చేసిన షేర్లకు మద్దతు లభిస్తోంది. మార్కెట్‌పై కార్పొరేట్‌ ఫలితాల ప్రభావం కొనసాగుతోంది. ఫలితాలు బాగున్న షేర్లు ఆకర్షణీయ లాభాలు గడిస్తుండగా, పనితీరులో నిరుత్సాహ పర్చిన కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టికి ప్రధాన నిరోధం 14750 వద్ద ఎదురు కానుంది. ఈ స్థాయిని నిఫ్టి క్రాస్‌ చేస్తుందా అనేది చూడాల. ఒకవేళ ఈ స్థాయిని దాటితో స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మవచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఒక మోస్తరు లాభాలతో బయటపడాలని సూచిస్తున్నారు. నిఫ్టిలో ప్రస్తుతం 43 షేర్లు లాభాల్లో ఉండగా, 7 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బజాజ్‌ ఫైనాన్స్‌ 4,994.85 2.67

బజాజ్‌ ఆటో 3,870.00 2.23
టాటా మోటార్స్‌ 306.50 1.66

బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 10,238.75 1.46

హీరో మోటో కార్ప్‌ 2,944.50 1.34

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,498.60 -1.20

JSW స్టీల్‌ 662.65 -0.49

హిందాల్కో 364.80 -0.40

హిందుస్థాన్‌ లీవర్‌ 2,373.05 -0.29
SBI లైఫ్‌ 926.35 -0.26