For Money

Business News

నిఫ్టి: పెరిగినా నిలబడేనా?

కేవలం రెండు సెషన్స్‌లో దాదాపు రెండున్నర శాతం లాభపడిన నిఫ్టికి ఇవాళ నిజమైన పరీక్ష ఎదురుకానుంది. ఒకటి రేపటితో ఏప్రిల్‌ నెల డెరివేటివ్స్‌ పూర్తి కావడం, రెండోది కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడం. నిన్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో మార్కెట్‌ చాలా పాజిటివ్‌గా స్పందించింది. దేశీయ కార్పొరేట్‌ రంగం ప్రకటిస్తున్న ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి.వాస్తవానికి అనేక కంపెనీలు నిరాశాజనక ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అయితే లాభనష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్లు కూడా ఇదే విధంగా ట్రేడవుతున్నాయి. లాభనష్టాల్లో పెద్ద మార్పులు లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి స్వల్ప లాభాల్లో ఉంది. నిఫ్టి స్వల్ప లాభాలతో లేదా నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి 14700పై ఒత్తిడి వచ్చే అవకాశముందని… టైట్‌ స్టప్‌లాస్‌తో నిఫ్టి అధిక స్థాయిలో అమ్మవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.