For Money

Business News

హిందుస్థాన్‌ లీవర్‌… సూపర్‌ ఫలితాలు

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో హిందుస్థాన్‌ యూని లీవర్‌ అద్భుత పనితీరు కనబర్చింది. మార్కెట్‌ అంచనాను మించింది. గత ఏడాదితో కంపెనీ నికర లాభం 41 శాతం పెరిగి రూ. 2,143 కోట్లకు చేరింది. అంతకుమునుపు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 11.55 శాతం పెరిగింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం కూడా 34.63 శాతం పెరిగి రూ. 12,132 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌ రూ. 17 ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదిలో కంపెనీ రూ. 45,311 కోట్ల టర్నోవర్‌పై రూ. 7,954 కోట్ల నికర లాభం ఆర్జించింది.