For Money

Business News

రూ. 1,358 వద్ద లిస్టయిన జియో

మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా జియో ప్లాట్‌ఫామ్స్‌ షేర్‌ రూ. 1,358 వద్ద లిస్టయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 21 శాతంపైగా లాభపడింది. అలాట్‌మెంట్‌లో కనీసం ఒక లాట్‌ దక్కిన ఇన్వెస్టర్‌కు రూ. 2,868లు వచ్చినట్లు. ఒక్కో లాట్‌ కింద 12 షేర్లను కేటాయించిన కంపెనీ. అదే రిలయన్స్‌ షేర్‌ హోల్డర్స్‌కు 23 షేర్లను రూ. 25,737కు కేటాయించారు. వీరికి లిస్టింగ్‌తో రూ. 5497ల లాభం వచ్చింది. ఒకదశలో రూ. 1,374ను తాకిన ఈ షేర్‌ ఇపుడు రూ. 1357 వద్ద ట్రేడవుతోంది. NSEలో 12.88 కోట్ల షేర్లకు డిమాండ్ ఉంది. అమ్మకం దారులు మాత్రం 74 లక్షల షేర్లకు మాత్రమే ఉన్నారు. ఈ స్థాయిలో కొనుగోలుదారులు ఉన్నా… అధిక ధరకు కొనేందుకు రెడీగా లేరన్నమాట. క్లోజింగ్‌ ముందు ఈ షేర్‌ ఇంకెంత పెరుగుతుందో చూడాలి. ఈ షేర్‌ ఇవాళ అప్పర్‌ సీలింగ్‌ ధర రూ. 1629 కాగా, లోయర్‌ సీలింగ్‌ ధర రూ. 1086.

Leave a Reply