For Money

Business News

సిప్లా షేర్‌ ఇంకా రాణిస్తుంది

మార్కెట్‌ 15,000 స్థాయిలో తీవ్రంగా ఊసిగలాడుతోంది. ఒకవైపు కరోనా, మరోవైపు జీడీపీ వృద్ధిపై అనుమానాల కారణంగా మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనౌతోంది. కరోనా కష్టకాలంలో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిచిన రంగాల్లో మెటల్స్‌, ఐటీ, ఫార్మా ముందున్నాయి. మెటల్స్‌కు ఢోకా లేనట్లుంది. ఐటీ డల్‌గా ఉంది. ఇపుడు ఫార్మా ఒకటే కాస్త అటుఇటూగా ఉంది. మరి ఈ రంగంలో ఇపుడు పెట్టుబడి పెట్టొచ్చా అన్న అనుమానం ఇన్వెస్టర్లలో ఉంది. ఫార్మా చాలా జటిలమైన పరిశ్రమ. రకరకాల వ్యాపారాలు ఉంటాయి ఇందులో. ఎక్కువగా అమెరికాతో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఫార్మారంగంలోని సిప్లా కంపెనీ పై స్టాన్‌ఫోర్డ్‌ బెర్న్‌స్టెయిన్ అనే ఇన్వెస్ట్‌మెంట్‌మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ నిత్యా సుబ్రమణియం ఏమంటారో చూద్దాం.
ధరలు తగ్గుతాయి
ఫార్మా కంపెనీల లాభాలతో పాటు ధరలు కూడా తగ్గుతాయి. కాని కొన్ని కంపెనీలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో రాణిస్తాయి. ఎందుకంటే ఫార్మా రంగంలోనే అనేక రకాల కంపెనీలు ఉంటాయి. ఉదాహరణకు బయోసెములర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందని అనుకున్నామని, కాని ఊహించిన స్థాయిలో పెట్టుబడులు పెట్టకపోవడంతో బయోకాన్‌ వంటి కంపెనీ కూడా ఈ విభాగం నుంచి ఆశించిన లాభాలు పొందలేదని పేర్కొంది. ఇపుడున్నవాటిలో కాంపోజిట్‌ ఫార్మేలేషన్స్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని తమ అంచనా అని నిత్యా సుబ్రమణియం అంటున్నారు. ఫార్మా కంపెనీల షేర్ల ధరలు తగ్గుతాయని అయితే 2014-15 స్థాయికి తగ్గే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు ఎపుడు ఎంటర్‌ అవుతామనేది ప్రధాన అంశమేనని అన్నారు. ఇపుడున్న కంపెనీలలో సిప్లా, సన్‌ ఫార్మా కంపెనీలను కొనుగోలు చేయడం మంచిదని ఆమె సలహా ఇస్తున్నారు. వీటిలో కూడా సిప్లాకు ఆమె అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాదిలో ఈ షేర్‌ దాదాపు రెట్టింపు అయింది. ఇపుడు కాంప్లెక్స్‌ జనరిక్స్‌ తయారు చేస్తున్న కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. వాటిలో సిప్లా,లుపిన్‌, డాక్టర్ రెడ్డీస్‌కు మంచి లాభాలు ఉంటాయని పేర్కొంది. అయితే అమెరికాలో చాలా తక్కువ వాటా ఉన్న సిప్లా మిగిలిన కంపెనీలకన్నా బాగా వృద్ధి చెందే అవకాశముందన్నారు. అమెరికా ఎఫ్‌డీఐ వద్ద కంపెనీ వేసిన పలు దరఖాస్తులకు ఆమోదం వచ్చిన వెంటనే సిప్లా ఫలితాలు పెరుగుతాయన్నారు. రెసిపిరేటరీ జనరిక్స్‌ విషయంలో బాగా రాణిస్తుందని నిత్యా పేర్కొన్నారు. ఇతర కంపెనీలు ఇప్పటికే బాగా లబ్ది పొందాయని, కాని సిప్లా ఎబిటా(EBITA) బాగా పెరిగే అవకాశముందన్నారు. వాస్తవానికి 2019-20 వరకు సిప్లాకు అమెరికా మార్కెట్‌లో నష్టాలు వచ్చేవని… ఇపుడు మనదేశంలో వస్తున్న మార్జిన్లకు సమానంగా అమెరికాలో వస్తున్నాయని పేర్కొంది. రెస్పరేటరీ జనరిక్స్‌ తయారు చేసే కంపెనీలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయి. సిప్లాకు ఇది ప్లస్‌ పాయింట్‌ అని నిత్యా సుబ్రమణియం పేర్కొన్నారు. అమెరికా మార్కెట్‌లో వాటా తక్కువగా ఉండటం ఈ కంపనీకి మేలు చేసే అంశమని, ప్రస్తుతం అక్కడి మార్కెట్‌ నుంచి కేవలం 45 కోట్ల డాలర్ల వ్యాపారం మాత్రమే వస్తోందన్నారు. లుపిన్‌, సన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌కు కూడా అకాశమున్నా… సిప్లా పనితీరు బాగుంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. రెమ్‌డెసివియర్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సిప్లా, రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కోవిడ్‌ వ్యాపారం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదన్నారు.