For Money

Business News

అనూహ్య లాభాలు

గిఫ్ట్‌ నిఫ్టి మార్కెట్‌ ప్రారంభ సమయంలో 40 పాయింట్లు ఉండగా, నిఫ్టి ఓపెనింగ్‌లోనే 180 పాయింట్ల లాభంతో 23978 స్థాయిని తాకింది. సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ పెంచడంతో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ షేర్లు 3 శాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది. అలాగే బ్యాంకుల్లో కూడా. నిఫ్టిలో శ్రీరామ్ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌తో పాటు బజాజ్ ఫిన్‌ సర్వ్‌ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో సన్‌ఫార్మా టాప్‌ ఉంది. అమెరికా కంపెనీ టేకోవర్‌ వార్త ఈ కౌంటర్‌కు నెగిటివ్‌గా ఉంది. టీసీఎస్‌ ఫలితాలు మార్కెట్‌ను ఏమాత్రం రుచించలేదు. ప్రధాన ఐటీ కౌంటర్లన్నీ రెడ్‌లో ఉన్నాయి. ఫలితాల తరవాత టీసీఎస్‌ టార్గెట్‌ను పలు బ్రోకింగ్‌ కంపెనీలు తగ్గించాయి. కరెన్సీలో వచ్చిన లాభాలు మినహా… కంపెనీ పనితీరులో పెద్దగా మార్పు లేదని అనలిస్టులు భావిస్తున్నారు. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ ఉన్నాయి.

Leave a Reply