For Money

Business News

కొత్త ర్యాలీకి శ్రీకారం?

ఇవాళ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కానున్నాయి. ఇస్లామాబాద్‌లో ఇరాన్‌, అమెరికా మధ్య రేపటి నుంచి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. టీసీఎస్‌ ఫలితాలతో ఐటీ కౌంటర్లలో కొనుగోళ్ళ ఆసక్తి వస్తుందేమో చూడాలి. అనేక త్రైమాసికాలు స్తబ్దుగా ఉన్న టీసీఎస్‌ ఈసారి 12 శాతం వృద్ధి చూపించింది. ఈ నేపథ్యంలో విప్రో కూడా వచ్చే వారం షేర్ల బై బ్యాక్‌ ప్రకటించనుంది. మరోవైపు వేసవి తీవ్రమౌతోంది. ఏసీ తయారు చేసే కంపెనీల షేర్లు క్రమంగా పెరుగుతున్నాయి. అలాగే ఓఎంసీ షేర్లలో ఆసక్తి కొనసాగే ఛాన్స్‌ ఉంది. గిఫ్ట్‌ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ఉంది. ఈవారం నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ సోమవారం క్లోజ్‌ కానుంది. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వచ్చే మంగళవారం మార్కెట్లకు సెలవు. మార్కెట్‌లో భారీ నష్టాలకు దాదాపు బ్రేక్‌ పడినట్లే. కాబట్టి ఇక నుంచి సూచీల బదలు.. సీజన్‌ను బట్టి పెరిగే షేర్లపై దృష్టి పెట్టడం అవసరం. ఎస్‌ఐపీలో పెట్టుబడులకు ఇది ఛాన్స్‌గా భావించవచ్చు.

Leave a Reply