For Money

Business News

నిఫ్టి నెక్ట్స్‌ టార్గెట్‌?

ఇవాళ మార్కెట్‌ లాభాల్లో ప్రారంభం కానుంది.ఇపుడు గిఫ్ట్‌ నిఫ్టి 70 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు అదరగొట్టాయి. డౌజోన్స్‌ స్థిరంగా ముగిసినా…నాస్‌డాక్‌ 1.6 శాతం లాభంతో దుమ్మురేపింది. వరుసగా మూడు రోజుల నుంచి కనీసం ఒక శాతంపైగా లాభంతో నాస్‌డాక్‌ ముగుస్తోంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. డాలర్‌ స్వల్పంగా తగ్గినా… క్రూడ్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభం కానున్నాయి. ఇవాళ సెన్సెక్స్‌ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు ఉంది. ఈనెలలో ఇప్పటి వరకు రూ. 48వేల కోట్ల షేర్లు అమ్మని విదేశీ ఇన్వెస్టర్లు నిన్న రూ. 666 కోట్ల నికర కొనుగోళ్ళు చేశాయి. నిఫ్టి గనుక 24,350 స్థాయి దాటితే భారీ ర్యాలీకి ఛాన్స్‌ ఉందని అనలిస్టులు అంటున్నారు. నిన్న అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ డిఫెన్స్‌ షేర్లతో పాటు ఏసీ తయారీ కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగనుంది. అలాగే ఏసీలు అమ్మే బ్లూస్టార్‌, ఓల్టాస్‌ షేర్లలో లాంగ్‌ ర్యాలీకి ఛాన్స్‌ ఉంది.

Leave a Reply