For Money

Business News

నిరాశపర్చిన టెక్‌ మహీంద్రా

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా కంపెనీ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అంతక్రితం త్రైమాసకం కన్నా 17.4శాతం క్షీణించిరూ. 1081 కోట్లకు పడిపోయింది. ఈ కంపెనీ రూ. 1,313 నికర లాభం వస్తుందని సీఎన్‌బీసీ టీవీ 18 అంచనా వేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో కంపెనీ రూ. 1309 కోట్ల నికర లాభం ఆర్జించింది. జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ ఆదాయం రూ. 9,729 కోట్లు. ఈ విషయంలో కూడా కంపెనీ అంచనాలను చేరుకోలేదు. ఐటీ సంబంధిత ఆదాయంలో పెద్దగా మార్పు లేదు. అలాగే బీపీఓ బిజినెస్‌ కూడా. ఒక్కో షేర్‌కు రూ. 15 ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.