For Money

Business News

ఇవాళ నష్టాలేనా?

మార్కెట్‌ ఇవాళ బలహీనంగా ప్రారంభం కానుంది. గిఫ్ట్‌ నిఫ్టి 86 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. రాత్రి వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ముగిసింది. అమెజాన్‌, మెటా, ఆల్ఫాబెట్‌ ఫలితాలు వస్తున్నాయి. ఏఐలో భారీ పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆందోళన కన్పిస్తోంది. ఫలితాలు బాగున్నా ఈ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక క్రూడ్‌ 120 డారల్లను టచ్‌ కావడంతో మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కన్పించనుంది. అలాగే USDINR కూడా 95ను టచ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇవాళ బీఎస్‌సీ సెన్సెక్స్‌ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. పైగా రేపు మార్కెట్లకు సెలవు. ఎగ్జిట్ పోల్స్‌ ప్రభావం వచ్చే సోమవారం మార్కెట్‌పై కన్పించనుంది. దీంతో ఇవాళ మార్కెట్‌ పాజిటివ్‌గా ముగుస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

Leave a Reply