For Money

Business News

నిఫ్టి నిలబడేనా?

భారత మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిన్న 24000 దిగువన క్లోజైన నిఫ్టి ఇవాళ మళ్ళీ 24వేల పైన ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఓపెన్‌ ఏఐ వృద్ధి అవకాశాలపై ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వచ్చిన కథనంతో ఏఐ సంబంధిత షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా చాట్‌ జీపీటీ నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని కంపెనీ భావిస్తున్నట్లు ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది. రాత్రి ఒకదశలో 1.6 శాతం క్షీణించిన నాస్‌డాక్‌, తరవాత 0.69 శాతం నష్టంతో ముగిసింది. ఉదయం నుంచి అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో చైనా నష్టాల్లో ఉంది. ఇవాళ నిఫ్టి లాభాల్లో ప్రారంభమైనా… ఎంత వరకు నిలబడుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ రానున్నాయి. ఓటింగ్‌ శాతం భారీగా పెరిగితే మార్కెట్‌ స్పందించే ఛాన్స్‌ ఉంది. మరోవైపు USDINR 95 దిశగా పయనిస్తోంది. నిన్న రికార్డు స్థాయిలో నష్టపోయి 94.54 వద్ద ముగిసింది. అలాగే పీఎస్‌యూ బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన క్రెడిట్‌ లాస్‌ గైడ్‌లెన్స్‌ దెబ్బ ఇవాళ కూడా కొనసాగుతుందా అనేది చూడాలి. 2027 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నరిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకు షేర్లు కోలుకోవచ్చు. రేపు సెన్సెక్స్‌ మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. అలాగే రేపు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం మార్కెట్‌పై చూపే ఛాన్స్‌ ఉంది. ఇక ఎల్లుండి స్టాక్‌ మార్కెట్లకు సెలవు. సో.. ఇవాళ, రేపు మార్కెట్‌కు చాలా కీలకం.

Leave a Reply