For Money

Business News

14,500 దిగువన ముగిసిన నిఫ్టి

ఉదయం ఊహించినట్లే నిఫ్టి 14,550పైన అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి 14,557 స్థాయిని తాకినా, అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోయింది. ఉదయం అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లోముగిసినా… నిఫ్టి మాత్రం లాభాల్లో కొనసాగింది. యూరో మార్కెట్ల పెద్ద దమ్ము లేకపోయే సరికి… స్వల్ప లాభాల స్వీకరణ వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 143 పాయింట్ల అంటే ఒక శాతం లాభంతో 14,485 వద్ద ముగిసింది. బ్యాంకు షేర్లు ఉదయం ఆకర్షణీయ లాభాలతో ఉన్నా… స్వల్ప లాభాల స్వీకరణ వచ్చింది. పార్మా, ఐటీ షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పించింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
యాక్సిక్‌ బ్యాంక్‌ 699.50 4.19
JSW స్టీల్‌ 657.00 3.40
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,270.00 3.33
ఐసీఐసీఐ బ్యాంక్‌ 588.70 3.29
గ్రాసిం 1,320.00 3.28

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సిప్లా 907.95 -2.96        బ్రిటానియా 3,546.00 -2.86
హెచ్‌సీఎల్‌ టెక్‌ 930.00 -2.68
బీపీసీఎల్‌ 417.60 -1.29
సన్‌ ఫార్మా 633.45 -0.71