కీలక స్థాయికి దిగువన
మార్కెట్ ఇవాళ మిడ్ సెషన్ తరవాత ఒత్తిడికి లోనైంది. ముఖ్యంగా నిఫ్టిలో ఏప్రిల్ నెల డెరివేటివ్స్ ప్రభావం మార్కెట్‌పై స్పష్టంగా కన్పించింది. పలు బ్లూచిప్ షేర్లలో పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ కన్పించింది. నిన్న భారీ లాభాలు పొందిన షేర్లు ఇవాళ నష్టాలు పొందాయి. మరోవైపు క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. నిఫ్టి 24181 పాయింట్ల గరిష్ఠ స్థాయి నుంచి 23957పాయింట్లకు పడిపోయింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 23995 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 97 పాయింట్లు నష్టపోయింది. క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో ఓఎన్‌జీసీ ఇవాళ నిఫ్టి టాప్5 గెయినర్స్‌లో టాప్‌లో నిలించింది. అదానీ ఎంటర్‌ప్రైజస్, కోల్ ఇండియా, రిలయన్స్, నెస్లే షేర్లు తరువాతి స్థానంలో ఉన్నాయి. ఇక నిఫ్టి 50 నష్టాల్లో ఉన్న టాప్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ ముందుంది. తరువాతి స్థానంలో మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండిగో షేర్లు ఉన్నాయి. ఇవాళ నిఫ్టిలో 3379 షేర్లు ట్రేడవగా, 1490 షేర్లు గ్రీన్‌లో, 1784 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
