For Money

Business News

అనిల్‌ అంబానీపై సెబి కొరడా

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించిన పలు అవకతవకల్లో పాత్ర ఉందన తెలియడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీపై సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి 3 నెలల పాటు నిషేధం విధించింది. ఆయన షేర్‌ మార్కెట్‌లో ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ వంద పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కంపెనీకి చెందిన అమిత్ బప్నా, రవీంద్ర సుధాకర్ , పింకేశ్ ఆర్ షాలోపై కూడా నిషేధం విధించినట్లు వెల్లడించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించి వీరు మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ఆరోపణ. ‘సెబీ వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియరీతో కానీ , ఏ లిస్టెడ్ కంపెనీతో కానీ లేదా ఏ పబ్లిక్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు / ప్రమోటర్ల నుంచి కానీ తదుపరి ఉత్తర్వులు అందేంత వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాద”ని సెబి పేర్కొంది. కంపెనీకి సంబంధించిన నిధులను ఇతర ఖాతాలకు దారి మళ్ళించారనే ఆరోపణలను విచారించిన సెబీ వీరితో పాటు మరో 28 మంది వ్యక్తులు/సంస్థలపై కూడా చర్యలు తీసుకుంది. ఈ కంపెనీ వివిధ సంస్థలకు 2018-19 మధ్యకాలంలో రుణ మంజూరుపై విచారణ జరిగింది. కంపెనీ ఇతర సంస్థలకు చట్ట విరుద్ధంగా నిధులు మళ్ళిస్తున్నారని ఆరోపిస్తూ ఆడిటింగ్‌ సంస్థ ద ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అండ్‌ కంపెనీ ఆ కంపెనీకి రాజీనామా కూడా చేసింది. 2018-19లో ఈ కంపెనీ మంజూరు చేసిన రుణ మొత్తం రూ. 900 కోట్ల నుంచి రూ. 7900 కోట్లకు పెరిగిందని… ఈ రుణా మంజూరు విషయంలో అనిల్‌ అంబానీతో పాటు మరో కీలక వ్యక్తి ఇష్టానుసారంగా రుణాలు మంజూరు చేశారని సెబీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి నోటీసు జారీ చేసిన కంపెనీల్లో ఇవి కూడా ఉన్నాయి.

అధార్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ అగ్రి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫి మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరియన్ మూవీ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, దీప్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్, అజాలియా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. వినాయక్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. గామెసా ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హిర్మా పవర్ లిమిటెడ్, తులిప్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్‌బీర్‌ హై-టెక్ బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, నెటిజెన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇపుడు ఈ కంపెనీ పేరు క్లీ ప్రైవేట్ లిమిటెడ్)