For Money

Business News

కావేరీ సీడ్స్‌ నికర లాభం రూ.9 కోట్లు

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో రూ.102 కోట్ల ఆదాయంపై రూ .9 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ .100 కోట్ల ఆదాయంపై రూ .7.45 కోట్ల నికరలాభం వచ్చింది.. ఆదాయం స్థిరంగా ఉన్నా… నికరలాభంలో స్వల్ప వృద్ధి కనిపిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో పత్తి విత్తనాల వాటా తగ్గుతుండగా, ఇతర విత్తనాల వాటా పెరుగుతోందని కంపెనీ పేర్కొంది. హైబ్రిడ్ వరి విత్తనాల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో 22 శాతం పెరిగినట్లు కంపెనీ వివరించింది. పత్తి విత్తనాల వాటా తగ్గించుకుని ఇతర విత్తన విభాగాల నుంచి ఆదాయాలు పెంచుకోవాలనే తమ లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుత ఫలితాలు ఉన్నట్లు కావేరీ సీడ్ కంపెనీ సీఎండీ జీవీ భాస్కరరావు తెలిపారు .