For Money

Business News

ఐటీ మినహాయింపు పరిమితి పెంచుతారా?

ఈసారి బడ్జెట్‌పై ఎవరికీ పెద్ద ఆశలు లేవు. కాకపోతే యూపీతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని జనాకర్షక పథకాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సమాజ్‌ వాదీ తన మేనిఫెస్టోలో పెట్టి పట్టణ ప్రాంతాల్లో మనరేగా వంటి స్కీమ్‌ ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. వృద్ధి రేటు పెరగాలంటే ప్రభుత్వం నుంచి భారీ ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ద్రవ్యోల్బణ అధికంగా ఉన్నందున పరిమితి పెంచవచ్చని కొందరు ఆశిస్తున్నారు. బడ్జెట్‌పై రకరకాల ఊహాగానాలు వస్తున్నా…ఈసారి బడ్జెట్‌ సాదాసీదాగానే ఉండొచ్చని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఐటీ స్లాబుల్లో మార్పులు చేయకపోవచ్చని, కాకపోతే కొన్ని నిబంధనల్లో మార్పు చేయొచ్చని భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌ మాత్రం ఈసారి బడ్జెట్‌లో ఎలాంటి మెరుపులు ఉండవని భావిస్తోంది.