For Money

Business News

బడ్జెట్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ ఏం కోరుకుంటోంది….

ప్రతి బడ్జెట్‌ ముందు ఆయా రంగాలకు ఆర్థిక మంత్రి తమ డిమాండ్లను సమర్పిస్తాయి. సాధ్యమైనంత వరకు పరిశ్రమపై అధిక భారం పడకుండా చూడటమే కాకుండా… అదనంగా కొత్త రాయితీలు, ప్రోత్సాహకాల కోసం ప్రయత్నిస్తుంటాయి. కరోనా పరిస్థితుల నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగం కోలుకుంటోంది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల షేర్లు కూడా బాగా రాణిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ పలు కీలక అభ్యర్థనలు చేసింది. వాటిలో కీలకమైనవి…
1. ట్యాక్స్‌ రిబేట్‌ కోసం రుణ వడ్డీ మినహాయింపు ఇపుడు రూ. 2 లక్షలు ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచాలి.
2. ఆఫర్డబిలిటి హౌసింగ్‌ (అందుబాటు ధరలో ఇళ్ళు) పరిమితులను నాన్‌ మెట్రో, మెట్రో ప్రాంతాల్లో ఇపుడు రూ. 45 లక్షలు ఉంది. దీన్ని నాన్‌ మెట్రో ప్రాంతాల్లో రూ. 75 లక్షలకు, మెట్రో ప్రాంతాలకు రూ.1.5 కోట్లకు పెంచాలి.
3. అపార్ట్‌మెంట్‌ సైజ్‌ మెట్రోలలో 60 చదరపు మీటర్ల నుంచి 90 చదరపు మీటర్ల, నాన్‌ మెట్రోలలో 90 చదరపు మీటర్ల నుంచి 120 చదరపు మీటర్లకు పెంచాలి.
4. మధ్య ఆదాయ పరిమితి వర్గాలకు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద అందిస్తున్న క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌ను ఈ ఏడాది చివరి వరకు పొడిగించాలి
5.REITలో రూ. 50,000లకు మించి చేసిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఇవ్వాలి
క్యాపిటల్‌ ఆస్తులపై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను 10 శాతం విధించాలి. హోల్డింగ్‌ పీరియడ్‌ను 12నెలలకు తగ్గించాలి.

ఇదే అంశంపై సీఎన్‌బీసీ టీవీ18లో జరిగిన చర్చను చూడండి.