For Money

Business News

NIFTY TODAY: 18360 కీలకం

నిఫ్టి ఇవాళ ఎలా ఓపెన్‌ అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే సింగపూర్ నిఫ్టి 60 పాయింట్ల నష్టం చూపుతోంది. కాని కార్పొరేట్‌ ఫలితాలు బాగున్నందున నిఫ్టి ఓపెనింగ్‌లోనే లాభాల్లోకి వెళుతుందా లేదా నష్టాల్లోకి వెళుతుందా అన్నది చూడాది. ఎందుకంటే ఫలితాల గురించి మీడియా ఎలా రాసినా.. అసలైన రియాక్షన్‌ మార్కెట్‌ ఇస్తుంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లకు మార్కెట్‌ ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. నిఫ్టి 18220కి దిగువన వెళితే 18190ని తాకవచ్చు. ఇక్కడే లేదా 18170 వద్ద నిఫ్టికి కచ్చితంగా మద్దతు లభిస్తుంది. నిఫ్టి గనుక పుంజుకుని 18300 దాటితే 18320 ప్రాంతంలోనే తొలి ప్రతిఘటన రావొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఇక్కడ అమ్మొచ్చు లేదా 18340 దాకా ఆగి 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు.18360 దాటితే మాత్రం ర్యాలీకి ఆస్కారం ఉంది.