For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

గత శుక్రవారం అన్ని మార్కెట్లలో అనిశ్చితి కన్పించింది. యూరో మార్కెట్లు ఒక శాతం పైగా నష్టపోగా అమెరకా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. టెక్‌షేర్ల సూచీ నాస్‌డాక్‌ 0.59 శాతం లాభంతో ముగియగా, డౌజోన్స్‌ 0.56 శాతం నష్టంతో ముగిశాయి. బ్యాంకు షేర్లు క్షీణించడమే దీనికి కారణం. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 0.74 శాతం లాభంతో ఉండగా, హాంగ్‌సెంగ్‌ 0.62 శాతం నష్టంతో ట్రేడవుతోంది. షాంఘై సూచీ 0.84 శాతం లాభంతో ఉంది. సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ఉంది. ఇదే స్థాయి నష్టాలతో కాకున్నా… స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభం కావొచ్చు.