For Money

Business News

మెట్రో బ్రాండ్స్‌ ఫలితాలు అదుర్స్‌

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన మెట్రో బ్రాండ్స్‌ కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, నికర లాభం భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 54.63 శాతం పెరిగి రూ. 65.22 కోట్ల నుంచి రూ. 100.85 కోట్లకు చేరింది. అలాగే ఆదాయం కూడా రూ. 304 కోట్ల నుంచి రూ. 483 కోట్లకు చేరింది. అంటే 59 శాతం పెరిగిందన్నమాట. ఒక త్రైమాసికంలో ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది.డిసెంబర్‌ నెలాఖరుకు కంపెనీ 140 నగరాల్లో 629 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది.