For Money

Business News

మళ్ళీ భారీ నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

ఆరంభంలో వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ఉంది. డౌజోన్స్‌ గ్రీన్‌లో ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు మాత్రం ఒక మోస్తరు నష్టాలతో ఉండేవి. క్రమంగా నష్టాలు పెరగడంతో… డౌ జోన్స్‌ అరశాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక నాస్‌డాక్‌ 1.74 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.12 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ సమావేశం ముందు మార్కెట్‌లో ఒత్తిడి అధికంగా కన్పిస్తోంది. యూరో మార్కెట్లు కూడా క్లోజింగ్‌ భారీ ఒత్తిడి వచ్చింది. ఆరంభం నుంచి ఒక మోస్తరు లాభాలతో ఉన్న యూరో మార్కెట్లు క్లోజింగ్‌లో భారీగా నష్టపోయాయి. జర్మీన డాక్స్‌ ఒక శాతంపైగా నష్టపోయింది. యూరో స్టాక్స్‌ కూడా 0.9 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్వల్పంగా లాభపడింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 96.42 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌, బులియన్‌ మార్కెట్లలో నష్టాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 74 డాలర్ల లోపు ఉంది. బులియన్‌ వెండి 1.7 శాతంపైగా నష్టంతో ఉంది.