For Money

Business News

నష్టాలతో ముగిసినా…

రాత్రి వాల్‌స్ట్రీట్ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఒకదశలో గ్రీన్‌లో ఉన్న సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నాస్‌డాక్‌ ఏకంగా 1.5 శాతం నష్టపోయింది. అయితే క్లోజింగ్‌ కల్లా నష్టాలు చాలా వరకు తగ్గాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులపై అమెరికా నిషేధం విధించినా … సూచీలు క్లోజింగ్‌కల్లా కోలుకున్నాయి. నాస్‌డాక్‌ కేవలం 0.28 శాతం, డౌజోన్స్‌ 0.56 శాతం, ఎస్‌ అండ్ 500 సూచీ 0.73 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికాలో వారాంతపు చమురు నిల్వలు పెరిగినా… ముడి చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. క్రూడ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు డాలర్‌ ఇండెక్స్ 99 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటం విశేషం. డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి.