For Money

Business News

ఫీచర్‌ ఫోన్లలోనూ డిజిటల్‌ లావాదేవీలు

ఇక నుంచి డిజిటల్‌ లావాదేవీలను సాధారణ మొబైల్‌ వినియోగదారులకూ అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇక నుంచి ఫీచర్‌ ఫోన్‌ యూజర్లూ తమ మొబైల్‌ నుంచి డిజిటల్‌ లావాదేవీలను జరుపవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ‘123పే’ సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ).. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త యూఎస్‌ఎస్‌డీ ఆధారిత సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. కొత్త సర్వీస్‌తో కాల్స్‌, మేసేజ్‌ల వంటి కనీస సౌకర్యాలే తప్ప.. ఇంకా ఎటువంటి సదుపాయాలు లేని ఫీచర్‌ ఫోన్లలో కూడా డిజిటల్‌ లావాదేవీలను ‘123పే’ సర్వీస్‌ ద్వారా నిర్వహించుకోవచ్చు.డిజిటల్‌ చెల్లింపుల వినియోగదారుల కోసం ‘డిజిసాథీ’ పే రుతో నిరంతర హెల్ప్‌లైన్‌ను కూడా దాస్‌ ప్రారంభించారు.