For Money

Business News

ప్రైవేట్‌ చేతికి తిరుపతి ఎయిర్‌ పోర్ట్‌

అమ్మకానికి మరో 13 ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెద్ద ఎయిర్‌పోర్టులను సమీపంలోని చిన్న ఎయిర్‌పోర్టులతో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో అమ్మకాలని కేంద్ర నిర్ణయించింది. దీని కోసం ఆరు పెద్ద ఎయిర్‌పోర్టులు, ఏడు చిన్న ఎయిర్‌ పోర్టులను ఎంపిక చేసింది. వారణాసి ఎయిర్‌ పోర్టును కుషినగర్‌, గయా ఎయిర్‌ పోర్టులతో కలిపి అమ్ముతారు. అలాగే అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టును కంగారాతో, తిరుపతి ఎయిర్‌పోర్టును భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టుతో, రాయ్‌పూర్‌ను ఔరంగాబాద్‌ ఎయిర్‌పోర్టుతో, ఇండోర్‌ను జబల్‌పూర్‌ ఎయిర్‌పోర్టుతో, త్రిచ్చిని హుబ్లి ఎయిర్‌పోర్టును కలిసి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెబుతారు. ఆదాయంలో వాటా పద్ధతిలో వీటిని ప్రైవేటీకరిస్తారు.2024 మార్చికల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చూస్తుంటే ఒక కొంటే ఇంకోటి ఫ్రీ అన్న చందాన ఉంది వ్యవహారం.