విజయా డయాగ్నస్టిక్స్ లిస్టింగ్… ప్చ్
ఊహించినట్లే విజయా డయాగ్నస్టిక్స్ షేర్ లిస్టింగ్ కాస్త నిరుత్సాహం కల్గించింది. గ్రే మార్కెట్‌లో ఊహించినదానికన్నా తక్కువ ధరకు లిస్టయింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 531లకు ఆఫర్ చేయగా, ఇవాళ ఉదయం ఎన్‌ఎస్‌ఈలో రూ.540 వద్ద లిస్టయింది. ఒకదశలో రూ. 587.40కి చేరినా.. అమ్మకాల ఒత్తిడి రావడంతో ఇపుడు రూ. 577.25 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ మార్కెట్ కూడా కాస్త ఆశాజనకంగా ఉండటంతో ఆ మాత్రం లిస్టింగ్ లాభాలు వచ్చాయని.. లేకుంటే నష్టాల్లోనే లిస్టయ్యేదని అనలిస్టులు అంటున్నారు. ప్రస్తుత ధర వద్ద కూడా పెద్దగా మార్కెట్‌లో ఆసక్తి కన్పించడం లేదు.