For Money

Business News

గ్రీన్ కార్డు @ 5 వేల డాలర్లు

అమెరికా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అన్ని అర్హతలు ఉన్నవారు 5వేల డాలర్ల సప్లిమెంట్ ఫీజు చెల్లిస్తే గ్రీన్ కార్డు సొంతం చేసుకోవచ్చు. ఈ మేరకు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ జ్యుడీషియరీ కమిటీ ఓ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఆమోదం పొంది.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేస్తే.. చట్టరూపం దాలుస్తుంది. ముసాయిదా బిల్లు ప్రకారం దీని చెల్లుబాటు 2031 వరకు ఉంటుంది. భారత్‌కు చెందిన గ్రీన్‌కార్డు ఆశావహుల్లో ఈబీ2, ఈబీ3 కేటగిరీకి చెందిన వృత్తి నిపుణులు ఉన్నారు. అమెరికా తాజా బిల్లు చట్టరూపం దాలిస్తే వీరిలో చాలామందికి లబ్ధి కలగనుంది. ప్రయారిటీ డేట్‌ నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారంతా.. 5 వేల డాలర్ల సప్లిమెంటల్‌ రుసుము చెల్లిస్తే.. గ్రీన్‌కార్డు చేతికి వస్తుంది.