For Money

Business News

ప్రమోటర్లపై వేటు… జీ షేర్లకు డిమాండ్‌

ప్రమోటర్లయిన సుభాష్‌ చంద్ర కుటుంబ సభ్యులు కంపెనీ నుంచి వైదొలగాలని ఇతర ఇన్వెస్టర్లు నోటీసు ఇవ్వడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ప్రస్తుతం 20 శాతం లాభంతో ట్రేడవుతోంది. తొలుత పది శాతం పెరిగిన తరవాత కూలింగ్‌ ఆఫ్‌ టైమ్‌ ఇచ్చారు. తరవాత 5 శాతం చొప్పున ఈ షేర్‌ పెరుగుతోంది. ఇలా మూడుసార్లు పెరిగిన తరవాత ఈ షేర్‌ 20 శాతం లాభంతో రూ. 224.20 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 186.85. రూ. 224.20 వద్ద కూడా ఎన్‌ఎస్‌ఈలో 83 లక్షల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. మరోవైపు జీ గ్రూప్‌లోని దాదాపు అన్ని షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. జీ లెర్న్‌ 15 శాతం లాభంతో రూ. 14.90 వద్ద ట్రేడవుతోంది. జీ మీడియా షేర్‌ 5 శాతం లాభంతో రూ. 10.40 వద్ద ట్రేడవుతోంది. ఇక డిష్‌ టీవీ షేర్‌ కూడా 10శాతం లాభంతో రూ. 21.25 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ ధర వద్ద కూడా కోటి 72 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. అమ్మకందారులు లేరు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ప్రమోటర్లు వైదొలగితే… కంపెనీ పనితీరు మెరుగు పడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.