For Money

Business News

రూ. 1,400 తగ్గిన వెండి

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అనేక దేశాల్లో వృద్ది రేటు తగ్గుతోందన్న వార్తలతో వెండిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇవాళ అనూహ్యం బ్రిటన్‌ వృద్ధి రేటు తగ్గిందన్న వార్తలతో మెటల్స్‌పై ఒత్తిడి పెరిగింది. డాలర్‌ రేటులో పెద్ద మార్పు లేకున్నా.. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుతుందని.. దరిమిలా మెటల్స్‌కు డిమాండ్‌ తగ్గుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పరిశ్రమల్లో వెండి వినియోగం ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కేవలం 0.6 శాతం క్షీణించగా, వెండి మూడు శాతంపైగా తగ్గింది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం 1676 డాలర్ల వద్ద, వెండి (ట్రాయ్‌ ఔన్స్‌) ధర 18.89 డాలర్లకు పడిపోయింది. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే… డాలర్‌ రూపాయి బలపడటం బులియన్‌ మార్కెట్‌కు మైనస్‌గా మారింది. ఎంసీఎక్స్‌ ఫార్వర్డ్‌ మార్కెట్‌లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.208 తగ్గి రూ.50888 వద్ద ట్రేడవుతోంది. అదే వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర రూ.1313 తగ్గి రూ. 57222 వద్ద ట్రేడైంది. అంతకుమునుపు రూ. 57,156ని కూడా తాకింది.అంటే రూ. 1400పైన క్షీణించిందన్నమాట. క్లోజింగ్‌లో కోలుకుంటుందా లేదా కనిష్ఠ స్థాయిని బ్రేక్‌ చేస్తుందా అన్నది చూడాలి.