For Money

Business News

గ్రీన్‌లో ఉన్నా… అనుమానమే

అయిదు రోజుల తరవాత వాల్‌స్ట్రీట్ సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఆరంభ లాభాలు తగ్గడంతో… ఈ సూచీలు మళ్ళీ నష్టాల్లో జారుకుంటాయన్న అనుమానం అనలిస్టుల్లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే నాస్‌డాక్‌ 0.01 శాతం గ్రీన్‌లో ఉండగా, ఎస్‌ అండ్‌ పీ 0.08శాతం, డౌజోన్స్‌ 0.36 శాతం లాభాల్లో ఉన్నాయి. అంటే ఏ క్షణమైనా సూచీలు రెడ్‌లో వెళ్ళేందుకు రెడీగా ఉన్నాయి. యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు డాలర్‌ పెరిగినా… డాలర్‌ ఇండెక్స్‌ 113 ప్రాంతంలోనే ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గినట్లు కన్పిస్తున్నా స్థిరంగా ఉన్నాయి. ఇవాళ క్రూడ్‌ భారీగా క్షీణించింది. మూడు శాతంపైగా తగ్గడంతో బ్రెంట్‌ క్రూడ్‌ 92 డాలర్ల దిగువకు వచ్చేసింది.