పెర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకి మస్క్..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పెర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘Burnt Hair’ బ్రాండ్ పేరిట కొత్త పర్‌ఫ్యూమ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే 10,000కు పైగా బాటిళ్లు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్‌ఫ్యూమ్ బాటిల్ ధర 100 డాలర్లు అంటే రూ.8,230. క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్స్‌తో కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చని మస్క్ తెలిపారు. పైగా ఈ పర్‌ఫ్యూమ్‌ను మహిళలు, పురుషులు కూడా వాడొచ్చని వెల్లడించారు. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే తనకు లక్షల డాలర్ల ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. మస్క్‌కు చెందిన బోరింగ్ కంపెనీ ఈ బాటిల్స్‌ను అమ్ముతోంది.
