For Money

Business News

బాబోయ్‌… ఇవేం ధరలు

ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినా దేశంలో వస్తువుల రీటైల్‌ ధరలు తగ్గడం లేదు. ప్రభుత్వం వెల్లడిస్తున్న డేటా ప్రకారమే వరుసగా 9వ నెలలో కూడా ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రీటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల గరిష్ఠానికి చేరుతూ 7.4 శాతానికి చేరింది. ఆగస్టులో ఈ ద్రవ్యోల్బణం 7 శాతం. గత ఏడాది సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 4.35 శాతమే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసిన గరిష్ఠ స్థాయి 6 శాతాన్ని దాటి రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇది వరుసగా 9వ నెల.రీటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం…ఆహార వస్తువుల ధరలు పెరగడమే. సెప్టెంబర్‌ ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగింది. నెల రోజుల్లో దాదాపు 1 శాతం పెరగడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో సామన్యుడు ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో అర్థమౌతోంది. మార్కెట్‌లో పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, చేప లు, మాంసం, పండ్లు, పాల ఉత్పత్తులు.. ఇలా అన్నింటి ధరలు భారీగా పెరిగాయి. పరపతి విధానంలో భాగంగా ఆర్బీఐ ప్రకటిస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం ఆహార వస్తువుల ధరలపై ప్రభావం ఏమాత్రం చూపలేకపోతోంది.