For Money

Business News

పడకేసిన పారిశ్రామిక రంగం

భారత పారిశ్రామిక రంగం మళ్ళీ పడకేసింది. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్‌ 0.8 శాతానికి తగ్గింది. గనులు, తయారీ రంగాల నితీరు తీసికట్టుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 18 నెలల నుంచి లో బేస్‌పై నెట్టుకు వస్తున్న ఐఐపీ డేటా ఇపుడు మరింతగా క్షీణించింది. లో బేస్‌ అంటే వృద్ధి రేటు చాలా పడిపోయిన తరవాత దాని ఆధారంగా పెరుగుదల లెక్కించడం. గత ఏడాది ఫిబ్రవరిలో నమోదైన కనిష్ఠ స్థాయి మైనస్‌ 3.2 శాతం తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. అంటే 18 నెలల కనిష్ఠస్థాయి అన్నమాట. ఈ ఏడాది ఏప్రిల్‌-ఆగస్టు నెలల మధ్య కాలంలో ఐఐపీ వృద్ధిరేటు 7.7 శాతం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 29 శాతం.