For Money

Business News

లాభాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. చిత్రంగా అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో క్లోజ్‌ కావడం విశేషం. ఆరంభంలో నష్టాల్లో ఉన్న నాస్‌డాక్‌ క్లోజింగ్‌ సమయానికల్లా కోలుకుంది. డాలర్‌ స్వల్పంగా క్షీణించగా, క్రూడ్‌ ఆయిల్‌ కోలుకుంది. బ్రెంట్‌ క్రూడ్ 89 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇదే ట్రెండ్‌ ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లలో కొరవడింది. చాలా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లను కరోనా ఇబ్బంది పెడుతోంది. హాంగ్‌సెంగ్ స్థిరంగా ఉంది. పెద్ద మార్పులు లేవు. జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా మార్కెట్లు మాత్రం 0.63 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. తైవాన్‌ కూడా దాదాపు అర శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 63 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలకు ఆస్కారం ఉంది.