For Money

Business News

LEVELS: లాభాలు స్వీకరించండి

నిఫ్టి క్రితం ముగింపు 18,244. సింగపూర్‌ నిఫ్టి 65 పాయింట్ల లాభంతో ఉంది. సో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18300ను దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిన్న నిఫ్టిని కొనుగోలు చేసిన వారు ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టిలో లాభాలు స్వీకరించడం మంచిదని సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సలహా ఇస్తున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేవని… కాబట్టి 18300 ప్రాంతంలోలాభాలు స్వీకరించడం మంచిదని ఆయన అన్నారు. రిస్క్‌ తీసుకునే వారు 18300 స్టాప్‌లాస్‌తో కొనసాగించవచ్చిన అన్నారు. అయితే 18200 వద్ద పుట్‌ రైటింగ్ జోరుగా ఉంది. 18200 పుట్‌రైటింగ్ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 93 లక్షలు కాగా అత్యధిక కాల్ రైటింగ్‌ 18300, 18400 వద్ద ఉంది. ఈ రెండు కాంట్రాక్ట్‌ల వద్ద ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఒక కోటి. సో నిఫ్టికి ఈ స్థాయిలో గట్టి ప్రతిఘటన ఉంది. కాబట్టి 18300 స్టాప్‌లాస్‌తో పొజిషన్‌ను కొనసాగించి.. మీ రిస్క్‌ను బట్టి లాభాలతో బయటపడండి. 18360పైన నిఫ్టి ఒక గంటకు పైగా నిలబడితే… నిఫ్టి మరింత ముందుకు వెళ్ళొచ్చు. కాని ఆ ఛాన్స్‌ ఇవాళ ఉండకపోవచ్చని అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. మరి కొనాలని అనుకున్నవారు 18230 వరకు వెయిట్‌ చేయాలని అన్నారు. ఈ ప్రాంతానికి నిఫ్టి వస్తే 18150 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అభిప్రాయపడ్డారు.