For Money

Business News

క్రూడ్‌… ఈక్విటీ అప్‌

యూరప్‌లో మెజారిటీ మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. డాక్స్‌ వంటి ప్రధాన మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో ఉన్నాయి.యూరో స్టాక్స్‌ 50 సూచీ మాత్రం 0.58శాతం లాభంతో ట్రేడవుతోంది. ఒపెక్‌ క్రూడ్‌ ఉత్పత్తి పెంచుతుందని తాను అన్నట్లు వచ్చిన వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. దీంతో మళ్ళీ క్రూడ్‌ ధరలు పెరగనారంభించాయి. బ్రెంట్ క్రూడ్‌ 89 డాలర్లకు చేరింది. ఎనర్జీ షేర్ల లాభాలతో డౌజోన్స్‌ సూచీ 0.83 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.71 శాతం లాభంతో ఉండగా, నాస్‌ డాక్‌ మాత్రం 0.46 శాతం లాభానికే పరిమితం అయింది. బులియన్‌ గ్రీన్‌లో లాభాలు స్వల్పమే. డాలర్‌ ఇవాళ స్వల్పంగా తగ్గడంతో దాని ప్రభావం కారణంగా బులియన్‌ ధరల్లో మార్పు వచ్చింది.