For Money

Business News

నష్టాల్లో SGX NIFTY

అమెరికా ఈక్విటీ మార్కెట్ ప్రధాన సూచీల కీలక స్థాయిల వద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు. చలన సగటు మూడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. మాంద్యం భయం మార్కెట్‌ను భయపెడుతోంది. ఫెడ్‌ ఈ బుధవారం వడ్డీ రేట్లను పెంచనుంది. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ రెడ్‌లో ముగిసింది. అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.7 శాతం నష్టపోగా, డౌజోన్స్ 0.9 శాతం నష్టపోయింది. డాలర్‌ స్వల్పంగా పెరిగింది. క్రూడ్‌ నిలకడగా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 76 డాలర్ల వద్ద ఉంటోంది. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. అన్ని మార్కెట్లు అర శాతంపైగా ఒక శాతం లోపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 45 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.