For Money

Business News

LEVELS: 18400 అత్యంత కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 18496. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ఉంది. ఒకవేళ ఈ స్థాయి నష్టాలతో నిఫ్టి ప్రారంభమైతే.. అంటే 18450 ప్రాంతంలో ప్రారంభమైతే.. వెంటనే కొనుగోలు చేయకుండా వెయిట్‌ చేయండి. నిఫ్టికి 18410 నుంచి 18450 మధ్య కొనుగోలు ఛాన్స్‌ ఉంది. రిస్క్‌ను బట్టి ఈ మధ్య నిఫ్టిని కొనుగోలు చేయవచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. కాస్త అనుభవం ఉన్న ఇన్వెస్టర్‌ నిఫ్టి లెవల్స్‌ చూసి బ్యాంక్‌ నిఫ్టిలో ట్రేడ్‌ చేస్తే ఇంకా అధిక లాభాలు వస్తాయని అంటున్నారు. అంటే నిఫ్టి బై జోన్‌లోకి వచ్చినపుడు నిఫ్టి బదలు బ్యాంక్‌ నిఫ్టిని కొనుగోలు చేయడమన్నమాట. నిఫ్టికి 18410 -18390 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఒకవేళ నిఫ్టి 18400 దిగువన ముగిస్తే.. నిఫ్టి క్రమంగా సెల్‌ జోన్‌లోకి ప్రవేశించినట్లుగా భావించాల్సి ఉంటుందని అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. ఈ స్థాయిలో కొనుగోలు చేసినవారు 18610 ప్రాంతంలో లాభాలు స్వీకరించవచ్చని… ఒకవేళ ఈ స్థాయిపై బలంగా నిలబడితే 18660కి కూడా చేరొచ్చని తెలిపారు. అయితే రిస్క్‌ వొద్దనుకునేవారు ఈలోగా బయటపడొచ్చని తెలిపారు. 18400పైన నిఫ్టి ఉన్నంత వరకు నిఫ్టి రివకరీకి ఛాన్స్‌ ఉందని… దిగువకు వెళితే మార్కెట్‌ డైనమిక్స్‌ మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 18500 కాల్‌ రైటింగ్‌ జోరుగా ఉందని.. కాబబట్టి 18600 దాటడం కష్టమని అన్నారు. 18600 ప్రాంతంలో కూడా కాల్ రైటింగ్‌ ఉన్నందున… మద్దతు వస్తుందేమో చూడాలి.