For Money

Business News

వందకు పైగా యాపిల్‌ స్టోర్స్‌

యాపిల్‌ ఫోన్ల కోసం ప్రత్యేకంగా చిన్న షోరూమ్స్‌ ప్రారంభించాలని టాటా గ్రూప్‌ యోచిస్తోంది. ఐఫోన్ల అమ్మకానికి సంబంధించి యాపిల్‌ కంపెనీతో ఒప్పందానికి టాటా గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. ఒప్పందం కుదిరితే దేశ వ్యాప్తంగా యాపిల్‌ ప్రత్యేక షో రూమ్‌ ఏర్పాటుకు టాటా గ్రూప్‌ కంపెనీ ఇన్‌ఫినిటీ రీటైల్‌ రెడీ అవుతోంది. ఈ కంపెనీ ఆధ్వర్వంలోనే క్రోమా రీటైల్‌ స్టోర్స్‌ నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఐఫోన్ల ఫ్రాంచైజీ కోసం టాటా గ్రూప్‌ యాపిల్‌తో చర్చలు జరుపుతోంది. అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా 500 లేదా 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిన్న షోరూమ్‌లు పెట్టాలని టాటాలు భావిస్తున్నారు.