For Money

Business News

మళ్ళీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

ఈక్విటీ మార్కెట్లలో పతనం జోరుగా సాగుతోంది. ఇవాళ కూడా అమెరికా ఫ్యూచర్స్‌ నామమాత్రపు లాభాల్లో ఉండటంతో .. ఆసియా మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ప్రధాన మార్కెట్లన్నీ రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రం 1.25 శాతం నష్టానికి పరిమితమైంది. ఇక చైనా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి.షాంఘై మార్కెట్‌ మాత్రం 0.8 శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లలో జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 105 స్థాయిని దాటడంతో ఇతర ప్రధాన కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. పైగా డాలర్‌తో పాటు క్రూడ్‌ ధరలు పెరగడం వర్ధమానదేశాలకు డబుల్‌ స్ట్రోక్‌గా మారింది. బంగారంలో పతనం ఇవాళ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. నిఫ్టికి అత్యంత కీలక స్థాయి 15700 ఇవాళ కోల్పోనుందన్నమాట.