For Money

Business News

పాతాళానికి ‘క్రిప్టో’ మార్కెట్‌

తొలిసారి క్రిప్టో మార్కెట్‌ ఇన్వెస్టర్లను భయపెట్టిస్తోంది. రోజువారీ పతనానికి దూరంగా ఉన్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు కూడా ఇపుడు లబోదిబోమంటులున్నారు. ప్రారంభం నుంచి లెక్కిస్తే బిట్‌ కాయిన్‌ సగటు ధర 23,500 డాలర్లు. రాత్రి 17.34 శాతం క్షీణంచి 21,331 డాలర్లకు క్షీణించింది. 2021 ఏప్రిల్‌ 12వ తేదీన బిట్‌ కాయిన్‌ 63,558 డాలర్లను తాకింది. అక్కడి నుంచి పతనం అవుతూ… ఇపుడు 21331 డాలర్లకు చేరింది. అంటే 14 నెలలో 60 శాతంపైగా క్షీణించింది. ఇథీరియం కూడా 15 శాతం క్షీణించి 1160 డాలర్లకు చేరింది. మొన్నటి వరకు రేసు గుర్రంలా పరుగెత్తిన క్రిప్టోకరెన్సీలు ఇపుడు పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల మార్కెట్‌ విలువ 9,22,600 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. గత ఏడాది జనవరి తర్వాత ఈ కరెన్సీల మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. మన మార్కెట్లోనూ క్రిప్టో కరెన్సీల విలువ కుప్పకూలింది. గత వారం రోజుల్లో బిట్‌కాయిన్‌ విలువ 65 శాతం నష్టపోయి రూ.55 లక్షల నుంచి రూ.19.72 లక్షలకు చేరింది. ఎథిరియమ్‌ క్రిప్టోకరెన్సీ విలువ రూ.3.85 లక్షల నుంచి రూ.1.02 లక్షలకు పడిపోయింది.