For Money

Business News

నియంత్రణ లోపాలు లేవు.. కానీ

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. స్టాక్‌ ధరల్లో తారుమారు, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనలకు సంబంధించి నియంత్రణ పరమైన లోపాలు ఉన్నాయని ఈ కమిటీ నిర్ధారణకు రాలేదు. కాని అదానీ గ్రూప్‌ విషయంలో హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌కు ముందు కొన్ని సంస్థలు షార్ట్‌ పొజిషన్లు తీసుకోవడం, రిపోర్ట్ తర్వాత స్టాక్‌ ధరలు పతనం అయినప్పుడు స్క్వేరింగ్‌ ఆఫ్‌ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అదానీ గ్రూప్‌ షేర్లలో తీవ్ర ఒత్తిడి వచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ సంస్థలు పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధననూ పాటించడం లేదని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. కమిటీ తన మధ్యంతర నివేదికను కోర్టుకు సమర్పించింది. కమిటీ నివేదిక వివరాలు ఇవాళ వెల్లడయ్యాయి.
అదానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి కమిటీ మరో కీలక అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలోకి విదేశీ కంపెనీల నుంచి నిధులు వచ్చాయని… ఆ విదేశీ కంపెనీల వెనుక ఉన్న అసలు యజమానులు ఎవరో తెలియడం లేదని కమిటీ స్పష్టం చేసింది. ఇదే అంశంపై పలు రాజకీయ పార్టీలు పార్లమెంటులో ప్రస్తావించాయి.