For Money

Business News

82కి చేరువలో రూపాయి

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ డాలర్‌ దెబ్బకు రూపాయి విలవిల్లాడుతోంది. డాలర్‌కు రూపాయి విలువ 82కు చేరువ అవుతోంది. తాజా సమాచారం మేరకు డాలర్‌కు రూపాయి విలువ 81.82కు చేరింది. నిన్న 81.58ని తాకిన రూపాయి ఇవాళ భారీగా క్షీణించింది. రాత్రి అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ భారీగా పెరిగింది. తాజా సమాచారం మేరకు డాలర్‌ ఇండెక్స్‌ 114.50ని దాటింది. ముడి చమురు 84 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఐటీ ఎగుమతులు తగ్గే పక్షంలో ఆర్బీఐ వద్ద డాలర్ల లభ్యత తగ్గే అవకాశముంది. అలాగే అమెరికాలో మాంద్యం మొదలైతే… భారత ఫార్మా ఎగుమతులపై ప్రభావం కన్పించనుంది. ఒకవేళ ఈ ఎగుమతులు కూడా తగ్గితే… మన మార్కెట్‌లో డాలర్‌ లభ్యత మరింత తగ్గుతుంది. ఇదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలు చేస్తున్నారు. ఇన్ని విధాలుగా డాలర్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశమున్నందున రూపాయి 82ను ఏ క్షణమైనా దాటే అవకాశముంది. గత వారం 78.5 రూపాయిలకు ఒక డాలర్‌ వస్తుండగా.. ఇపుడు డాలర్‌కు 82 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది.